SMC

 animated calligraphic line

PMC ఎన్నికలపై సందేహలు మరియు  సమాధానాలు

 1 SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి?
          ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి..తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి.. వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.
2.ఒక అబ్బాయి/అమ్మాయి 2వ తరగతిలో ఉన్నాడు.వీరి  మరొక అబ్బాయి/అమ్మాయి 5వ తరగతి లో ఉంది.వీరికి రెండు ఓట్లు ఇవ్వాలా??లేక ఒక ఓటు ఇవ్వాలా?
            వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి/తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు.
3.SMC కి ప్రతి తరగతి నుండి ముగ్గురుని ఎన్నుకోవాలి కదా!.ఆ ముగ్గురు ఎవరై ఉండాలి?

1.dis-advantage group కి చెందిన వారై ఉండాలి. అంటే sc, st, అనాధలు,వలసలు, వీధి బాలలు, cwsn పిల్లలు, HIV effected పిల్లలు
2.weaker sections చెందిన వారై ఉండాలి. అంటే BC, మైనార్టీలు.
3.కుటుంబ వార్షిక ఆదాయం 60,000/- లోపు గలవారు
.
4.SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?
వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.
5.ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?
ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.
6.ఎవరిని SMC చైర్మన్ గా??ఎవరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి?
ఇద్దరిలో ఒకరు కనీసం మహిళ అయి ఉండాలి. .మరొకరు ప్రతికూల పరిస్థితిలలో ఉన్న వర్గానికి చెందినవారు లేదా బలహీన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి.
7.SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి?
వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.
8 ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి?
ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.
తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి.

animated calligraphic line

SMC చైర్ పర్సన్ కొడుకు / కూతురు TC తీసుకున్న మరుక్షణమే ఆయన పదవి పోతుంది. SMC వైస్ చైర్ పర్సనే తిరిగి ఎన్నికలు జరిగేంత వరకు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. అతడికి చెక్ పై సంతకం పెట్టే అధికారంతో పాటు అన్ని అధికారాలూ ఉంటాయి.

స్కూల్లో చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చింది అనుకుంటే GO Ms No 41, Dated:19-06-2013 పేరా 4 Rule 19 (ii) (a) (2) ప్రకారం ఎంపికైన  SMC సభ్యుల పదవీకాలం రెండేళ్లు లేదా కూతురు / కొడుకు స్కూలు వదిలి వెళ్లే వరకు (ఏది ముందైతే అది).  SMC చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చిందే తప్ప స్కూలు వదిలి వెళ్ళలేదు. కాబట్టి, SMC చైర్ పర్సన్ కూతురు టెన్త్ క్లాసుకు వచ్చినాఆయనే / ఆమే చైర్ పర్సన్ గా కొనసాగుతారు.

SMC చైర్ పర్సన్ కూతురు / కొడుకు TC తీసుకోకుండా ప్రైవేట్ స్కూలుకు వెళ్తుంటే ఎన్ని రోజులు నుండి పాఠశాలకు రావడంలేదో చూసి పేరు తొలగించాలి. ( TSER Rule-45 ప్రకారం 30 రోజులు వరుసగా పాఠశాలకు రాని విద్యార్థుల పేర్లు  హాజరు పట్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది ). తల్లిదండ్రులకు లిఖితపూర్వకంగా నోటీసుఇచ్చి పేరు తొలగించడం మంచి ప్రయత్నం.

పూర్తి వివరములు కొరకు

GO.NO. 41 Dt 19-06-2013  The Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules, 2010 – Amendment – Orders – Issued.